Newsరవి అసలు యాంకర్ ఎలా అయ్యాడు.. అతని రెమ్యూనరేషన్ మీకు తెలుసా...

రవి అసలు యాంకర్ ఎలా అయ్యాడు.. అతని రెమ్యూనరేషన్ మీకు తెలుసా ?

యాంకర్ రవి హంగామా ఇప్పుడు మామూలుగా లేదు. బుల్లితెరపైన మనవాడు చేస్తున్న హల్చల్‌కి పైసలు కూడా లక్షల్లో వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే చిన్న ఏజ్‌లోనే మనవాడు ఆర్మీకి వెళ్ళాడు. అక్కడ ఇమడలేక వెనక్కి వచ్చేశాడు. చదువుకుంటూనే టివి యాంకరింగ్, సినిమాల్లో ఛాన్స్‌లో కోసం తిరిగాడు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం ఎప్పుడూ ముందుండే కింగ్ నాగార్జునను కలిసి ఆయనను ఇంప్రెస్ చేశాడు. ఆయన సపోర్ట్‌తో మా మ్యూజిక్‌లో యాంకర్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసే అవసరం రాలేదు రవికి. మంచి నటుడు కూడా అవ్వడంతో డే టు డే యాంకర్‌గా అద్భుతంగా డెవలప్ అయ్యాడు. జీ తెలుగులో వచ్చిన మొండి మొగుడు పెంకి పెళ్ళాం దెబ్బకు రవికి బుల్లితెరపైన స్టార్ ఢం వచ్చేసింది.

ఈటీవీలో వచ్చిన ఢీ జూనియర్స్, జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్ లాంటి ప్రోగ్రామ్స్‌తో రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది. పదివేలతో స్టార్ట్ అయిన రవి ఇప్పుడు నెలకు పదిలక్షలు తీసుకుంటున్నాడు. పటాస్, కిరాక్ లాంటి షోలతో దుమ్ము దులిపేస్తున్నాడు. మధ్య మధ్యలో వెండితరపైన కూడా తన యాక్టింగ్ సత్తా చూపిస్తున్నాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్‌తో వచ్చే ఇన్‌కం దీనికి అదనం. తెలుగు టాప్ ఛానల్స్ అన్నీ కూడా మనవాడిని యాంకర్‌గా తీసుకోవడానికి పోటీ పడుతున్నాయంటేనే మనవాడి రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన వాయిస్‌తో పాటు ఎనర్జీ లెవల్స్‌ని కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడానికి శక్తవంచన లేకుండా కష్టపడిన రవికి ఇప్పుడు రిజల్ట్స్ కూడా లక్షల్లో కనిపిస్తున్నాయన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news