Gossipsబన్నీని నమ్ముకుని రోడ్ ఎక్కినా డైరెక్టర్లు..

బన్నీని నమ్ముకుని రోడ్ ఎక్కినా డైరెక్టర్లు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు అన్న విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే విక్రం కుమార్ తో సినిమా చేయాల్సి ఉన్నా డిస్కషన్ స్టేజ్ లో అది క్యాన్సిల్ అయ్యింది. బన్నితో సినిమా క్యాన్సిల్ అవడంతో విక్రం కుమార్ నానితో సినిమా చేస్తున్నాడు. విక్రం ను కాదన్న బన్ని త్రివిక్రం తో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ఆ సినిమా కథ కూడా ఇంకా ఫైనల్ కాలేదట. త్రివిక్రం లైన్ మాత్రమే చెప్పాడట ఫుల్ స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదట. ఇదిలాఉంటే బన్నితో సినిమా కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మారుతి కూడా ఓ కథ రాసుకున్నాడట.

బన్నికి ఆ కథ వినిపించగా కథలో కొన్ని మార్పులు సూచించాడట. అయితే దర్శకుడు రాసుకున్న కథను మార్చి తనకు నచ్చిన విధంగా మార్చే విషయంలో బన్ని ఎక్కువ చేస్తున్నాడని అంటున్నారు. నా పేరు సూర్యలో కూడా వక్కతం వంశీకి బన్ని కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చాడట. అలా చేస్తే సినిమా ఓకే చేస్తాడని చెప్పాడట. అందుకే సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. తను చేసే ప్రతి సినిమాలో బన్ని వేలు పెట్టుడు ఉంటుందట. కొత్త దర్శకులైతే అది మరి ఎక్కువ ఉంటుందని అంటున్నారు.

మారుతి సినిమాకు బన్ని చెప్పిన సలహాలు పాజిటివ్ గానే ఉన్నాయట. అతని సలహా మేరకు మళ్లీ స్క్రిప్ట్ మార్చి తీసుకొచ్చే పనిలో ఉన్నాడట మారుతి. మారుతి డైరక్షన్ లో బన్ని సినిమా అంటే యూత్ ఫుల్ సినిమా ఆశించవచ్చు. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయినా సరే త్రివిక్రం సినిమా పూర్తయ్యాక ఉండే అవకాశం కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మిస్తారట. మరి బన్ని, మారుతి కాంబో ఎలంటి సినిమా చేస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news