2.0 మొదటి వారం కలక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి కష్టం..!

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 2.ఓ నవంబర్ 29న రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా 4 రోజుల్లో 400 కోట్లు కలెక్ట్ చేయగా వారంలో ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 40.02 కోట్లు కలెక్ట్ చేసింది. రోబో సీక్వల్ గా భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ గ్రాఫిక్స్ తో వండర్స్ క్రియేట్ చేసింది. విజువల్ గ్రాండియర్ గా టెక్నికల్ గా అదరగొట్టిన 2.ఓ మరోసారి రజినికాంత్ సత్తా చాటుతుంది.

సినిమాలో రజినికి ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ అదరగొట్టాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది. అయితే 6 రోజుల్లో ఈ మూవీ 40.02 కోట్లు వసూళు చేసింది. ఏరియాల వారిగా 2.ఓ 6 రోజుల కలక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత తెచ్చింది అంటే..

నైజాం : 16.99 కోట్లు

సీడెడ్ : 6.25 కోట్లు

ఉత్తరాంధ్ర : 5.01 కోట్లు

ఈస్ట్ : 2.92 కోట్లు

వెస్ట్ : 2.04

కృష్ణా : 2.34 కోట్లు

గుంటూరు : 2.90 కోట్లు

నెల్లూరు : 1.57 కోట్లు

ఏపి/తెలంగాణా : 40.02 కోట్లు

Leave a comment