టాలీవుడ్ స్టార్స్ ను వణికిస్తున్న ఆ సినిమా ట్రైలర్..!

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ఓ సినిమా ట్రైలర్ చూసి షాక్ అవుతుంది. సౌత్ లో పెద్ద పరిశ్రమగా పేరు ఉన్న టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. బాహుబలి సినిమా 300 కోట్లతో తెరకెక్కగా ఆ సినిమా తర్వాత 200 కోట్ల బడ్జెట్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. అయితే బాహుబలి ఇచ్చిన స్పూరితో కన్నడ పరిశ్రమలో కూడా ప్రయోగాలు మొదలయ్యాయి. అక్కడ యువ హీరో యశ్ హీరోగా కె.జి.ఎఫ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజరే సంచలనం సృష్టించగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలను పెంచింది.

గోల్డ్ మైన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రియల్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు. ట్రైలర్ లో హీరో అమ్మకు ఇచ్చిన మాట కోసం ఏం చేశాడు. ఎలా మారాడు అన్నది చూపించారు. ఇక విలన్ కూడా హీరో గురించి చెబుతూ అతను గ్యాంగ్ స్టర్ కాదు మాన్ స్టర్ అనడం క్రేజీగా ఉంది. సినిమా ట్రైలర్ రిచ్ గా ఉంది. సినిమాకు బడ్జెట్ కూడా భారీగా పెట్టినట్టు ఉన్నారు. యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మళయాలంలో కూడా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

భారీతనంతో కూడిన ఈ సినిమా ట్రైలర్ చూసి తెలుగు దర్శక నిర్మాతలకు వణుకు మొదలైంది. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సినిమా సంచలన విజయం అందుకోవడం గ్యారెంటీ. ఆరోజు తెలుగులో శర్వానంద్ పడి పడి లేచే మనసు, వరుణ్ తేజ్ అంతరిక్షం రిలీజ్ ప్లాన్ చేశారు. మరి కె.జి.ఎఫ్ దాటికి ఈ రెండు సినిమాలు నిలబడతాయో లేదో చూడాలి. ఈ మూవీని తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Leave a comment