Gossipsచివరికి అల్లుఅర్జున్ పరిస్థితి ఇలా తయ్యారయ్యిందా..!

చివరికి అల్లుఅర్జున్ పరిస్థితి ఇలా తయ్యారయ్యిందా..!

సూపర్ స్టార్ మహేష్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాపీ కొట్టడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. మహేష్, అల్లు అర్జున్ ఎవరి స్టైల్ వారిది అసలు ఇద్దరి హీరోల సినిమాలకు సంబంధమే ఉండదు అలాంటిది బన్ని ఎలా మహేష్ ను కాపీ కొడతాడని అనుకోవచ్చు. సినిమాల్లో ఎవరి స్టైల్ వారిదే అయినా బిజినెస్ లో మహేష్ ను ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్. ఓ పక్క సినిమాలతో పాటుగా వాణిజ్య ప్రకటనలలో మహేష్ బిజీగా ఉన్నాడు. మహేష్ దారిలోనే బన్ని కూడా యాడ్స్ చేస్తున్నాడు. అయితే మహేష్ అంత కాకున్నా బన్ని కూడా యాడ్స్ తో సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు మహేష్ చేస్తున్న బిజినెస్ కూడా ఫాలో అవుతున్నాడు బన్ని. ఈమధ్యనే మహేష్ ఏసియన్ శ్రీనివాస్ తో కలిసి ఏ.ఎం.బి సినిమాస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొండాపూర్-కొత్తగూడ ఏరియాలో భారీ హంగులతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు అది చూసేందుకు వెళ్లిన కొంతమది ప్రేక్షకులు ఇదో ఇంద్రభవనం అంటున్నారు. అయితే ఏసియన్ సినిమాస్ తో బన్ని కూడా థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడట.

మహేష్ ను యాడ్స్ లోనే కాదు బిజినెస్ లో కూడా ఫాలో అవుతున్న బన్ని మల్టీప్లెక్స్ బిజినెస్ లో కూడా అడుగుపెడతాడని తెలుస్తుంది. బన్ని కచ్చితంగా ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎలాగు అల్లు అరవింద్ కింద కొన్ని థియేటర్స్ ఉన్నాయి. గీతా ఆర్ట్స్ లో వచ్చే సినిమాలన్ని ఈ మల్టీప్లెస్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి బన్ని చేయబోయే ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news