Moviesట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు... (వీడియో.)

ట్రెండ్ మారినా.. ఫ్రెండు మారడు… (వీడియో.)

నేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు సాధించి మరో మంచి మూవీతో ప్రేక్షకులముందుకు రావడానికి రెడీ గా ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఒక్కరోజు ముందు ఫ్రెండ్స్ కి గిఫ్ట్ గా రిలీజ్ చేసారు. స్రవంతి సినిమాటిక్స్, పీఆర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్కులో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ట్రెండ్ మారినా ఫ్రెండు మారడు అంటూ సాగే ఈ లిరికల్ ఆడియోను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజ్ చేశారు . చంద్రబోస్ సాహిత్యంలో రూపు దిద్దుకున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరం కలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news