Gossipsరంగ‌స్థ‌లం రిలీజ్ డేట్ వెనుక అల్లు అర్జున్

రంగ‌స్థ‌లం రిలీజ్ డేట్ వెనుక అల్లు అర్జున్

ఎట్ట‌కేల‌కు రంగ‌స్థ‌లం రాక షురూ అయ్యింది

ఇంత‌కాలం నెల‌కొన్న కన్ఫ్యూషన్ క్లియ‌ర్  కానుంది

త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ కి సంబంధించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

రంగస్థలం 1985 చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో చాలా సతమతమ‌వుతోంది. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు 2018 సంక్రాంతికి విడుదల చేసేందుకు తామంతా సిద్ధం అని యూనిట్ చెప్పిన‌ప్ప‌టికీ అన్నీ అనుకున్న‌ట్లు కుద‌ర‌లేదు.కానీ షూటింగ్ పట్టాలక్కిన తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గోదారి ప‌ల్లెల్లో ఔట్ డోర్ షూటింగ్ అనుకున్న‌ట్లు సాగ‌లేదు.దీంతోసమ్మర్ ఏప్రిల్ లో రిలీజ్ అనేశారు.

ఇక అదే సమయంలో అల్లు అర్జున్ – నా పేరు సూర్యా కూడా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోవడంతో మళ్లీ మాట మార్చి  దానికంటే కొన్ని రోజుల ముందు తన సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఫైనల్ గా మార్చ్ 29న కూల్ గా రిలీజ్ చెయ్యాలని దర్శక నిర్మాతలు కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.త్వ‌రలోనే  ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న యూనిట్ నుంచి విడుద‌ల కానుంది. ఇక ప్రస్తుతం చరణ్ – బన్నీ షూటింగ్ లకు కాస్త బ్రేక్ చెప్పి  మనాలీ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు శిరీష్ కూడా వారితో పాటు వెళ్లి వారి పోటోలను తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాడు.టూర్ పూర్తికాగానే మ‌ళ్లీ షూటింగ్ షెడ్యూల్స్ షురూ కానున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news