Gossipsఎన్టీఆర్ బిగ్ బాస్ దెబ్బకి మల్టీస్టారర్ వచ్చేసింది..!

ఎన్టీఆర్ బిగ్ బాస్ దెబ్బకి మల్టీస్టారర్ వచ్చేసింది..!

బిగ్ బాస్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన నవదీప్, శివ బాలాజి కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ విన్నర్ గా శివ బాలాజి, షోలో చలాకీగా కనిపించిన నవదీప్ ఇద్దరు ఇదవరకే చందమామ సినిమాకు కలిసి పనిచేశారు. ఇక మళ్లీ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట.

ఓ నూతన దర్శకుడు ఈ కథ ఇద్దరికి నచ్చేసిందట. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాలో బిగ్ బాస్ లో ఉన్న మరికొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన శివ బాలాజి, నవదీప్ సిని కెరియర్ పరంగా మైలేజ్ పెంచుకునే పనిలో పడ్డారు.

ఇదే కాకుండా నవదీప్ ఓ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. బిగ్ బాస్ వీరి కెరియర్ లో ఓ కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news