Newsమన్యత హాట్‌ పిక్స్ పై సంజయ్ గరం..గరం ( ఫోటోస్ లింక్...

మన్యత హాట్‌ పిక్స్ పై సంజయ్ గరం..గరం ( ఫోటోస్ లింక్ )

ఇటీవలి కాలంలో ఇన్‌స్టాగ్రమ్ వేదికగా హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేసింది మాన్యతాదత్. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ భార్య అయిన మాన్యత విదేశాల్లో విహరిస్తూ అలాంటి ఫొటోలు పోస్టు చేయడం సంచలనమే అయ్యింది. ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్ల కన్నా ఎక్కువ స్థాయి గ్లామర్ ను ఒలకపోశారు మాన్యత. ఆమె మళ్లీ నటించాలని అనుకుంటున్నారని, సినిమాలతో బిజీ అయిపోవాలని అనుకుంటోందని..

అందుకే అలాంటి ఫొటోలు పోస్టు చేస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే మాన్యత అలాంటి ఉద్దేశం వ్యక్తం చేయలేదు. ‘మిడ్ డే’ పత్రిక ఒక ఆసక్తిదాయకమైన కథనాన్ని ప్రచురించింది. మాన్యత సినిమాల్లో నటించాలని అనుకుంటోందని, అందుకే అలాంటి పిక్స్ ను పోస్టు చేసిందని ఈ పత్రిక పేర్కొంది. అంతే కాదు.. మాన్యత సినిమాల్లోకి రావడం సంజయ్ దత్ కు ఇష్టం లేదని.. ఆమె పిక్స్ ను పోస్టు చేయడం పట్ల కూడా ఈ హీరో అసహనంతో ఉన్నాడని ఆ పత్రిక పేర్కొంది. మాన్యత సినీ నటే. కొన్ని సినిమాల్లో నటించిన ఈమెను లేటు వయసులో దత్ పెళ్లి చేసుకున్నాడు.

వివాహానంతరం వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత దత్ టాడా కేసులో శిక్ష ఖరారు కావడంతో జైలుకు వెళ్లాడు. కొన్నాళ్ల కిందట బయటకు వచ్చాడు. తిరిగి సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మాన్యత గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి .తన ఇంట్లో వాళ్లు సినిమాల్లోకి రావడానికి సంజయ్ వ్యతిరేకి అని తెలుస్తోంది. తన కూతురు త్రిశల నటి కావాలని అనుకుంటే.. తన కాళ్లు విరగొడతాను అని కూడా దత్ ఇది వరకూ వ్యాఖ్యానించాడు.

http://www.bollywoodlife.com/news-gossip/sanjay-dutt-unhappy-with-wife-maanayata-dutts-hot-pictures-on-instagram/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news