Moviesఅర్జున్ రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్ల జోరు....

అర్జున్ రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్ల జోరు….

యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకుడిని డైలమాలో పడేసి థియేటర్లకు రప్పిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఒక కాలేజ్ ఫంక్షన్లో ఈ సినిమా హీరో విజయ్ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తూ..
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కి మంచి బ్రేక్ తెస్తుందని చెప్పవచ్చు. పూర్తిగా యూత్ టార్గెట్ చేసి దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కించారు. విజయ్ ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించగా…విజయ్ సరసన షాలిని నటించింది. వినాయక చవితి పర్వదినాన ఆగష్టు 25 న ఈ సినిమాను విడుదల చేసారు. ఈ సినిమా ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా డిసైడ్ అవ్వడమే కాకుండా…అంతే ఉత్సాహంతో కలెక్షన్ల జోరు చూపిస్తోంది.

ఏరియా వారీగా కలెక్షన్ల వివరాలు…
నైజాం : Rs 1.40 Cr
సీడెడ్ : Rs 0.35 Cr
వైజాగ్ : Rs 0.21 Cr
గుంటూరు : Rs 0.21 Cr
ఈస్ట్ :Rs 0.11 Cr
వెస్ట్ : Rs 0.10 Cr
క్రిష్ణా : Rs 0.25 Cr
నెల్లూరు : Rs 0.06 Cr

ఏపీ మరియు తెలంగాణ : Rs 2.70 Cr

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news