Gossipsసినిమా రిలీజ్ కి ముందే విషాదంలో రాజశేఖర్

సినిమా రిలీజ్ కి ముందే విషాదంలో రాజశేఖర్

‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రం రేపు విడుదలకు సిద్దమయింది.ఇదే టైములో రాజశేఖర ఇంట ఒక విషాదకరమైన సంగటన చోటు చేసుకుంది.ఆయన భార్య నటి జీవితస్వంత సోదరుడు ఆయినా మురళి శ్రీనివాస్ గురువారం తెల్లవారుజామున అనారోగ్యం తో మృతి చెందారు.మురళి శ్రీనివాస్ గత కొంత కాలంగా అస్వస్థతకి గురయ్యారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచి, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలె నటుడు రాజశేఖర్‌ తల్లి మరణించగా.. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరోకటి చోటు చేసుకోవటం బాధాకరమైన విషయమేనని చెప్పుకోవాలి.
ఓ పక్క ఆయనను చూసుకుంటూనే సినిమా విడుదల ముందు జరిగే ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజశేఖర్, జీవిత బిజీగా వున్నారు. సినిమాకు స్పేషల్ ప్రీమియర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఇలా విషాదం జరిగింది. రాజశేఖర్ ఓ ఇంటర్వూలో వుండగా పరిస్థితి బాగా లేదని కబురు అందడంతో ఆయన వెంటనే సగంలో కార్యక్రమం ఆపేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. మరి ఇప్పుడు ఈ విషాదం సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news