Gossipsకేరాఫ్ సూర్య ట్రైలర్.. సందీప్ కు హిట్ దక్కేనా..!

కేరాఫ్ సూర్య ట్రైలర్.. సందీప్ కు హిట్ దక్కేనా..!

తెలుగువాడే అయినా తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న సందీప్ కిషన్ తెలుగులో సినిమాలు మంచి ఫలితాలు ఇవ్వకున్నా సరే తమిళంలో మాత్రం మనోడి సినిమాలకు డిమాండ్ ఏర్పడింది. తెలుగులో రీసెంట్ గా వచ్చిన నక్షత్రం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న సందీప్ కిషన్ కు ఆ సినిమా పెద్ద షాకే ఇచ్చింది.

ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ చేస్తున్న సినిమా కేరాఫ్ సూర్య. నా పేరు శివ డైరక్టర్ సుశీంద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ బేస్ తో వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా సినిమాతో కచ్చితంగా సందీప్ హిట్ కొడతాడని అనిపిస్తుంది.

మరి ఈ సినిమా అయినా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. నవంబర్ 10న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపైనే సందీప్ కిషన్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news