Gossipsవరుణ్ తేజ్ వల్ల కష్టాల్లో కుమారి..!

వరుణ్ తేజ్ వల్ల కష్టాల్లో కుమారి..!

అలా ఎలాతో తెరంగేట్రం చేసినా ఆ తర్వాత వచ్చిన కుమారి 21ఎఫ్ తో కుర్రాళ్ల హృదయాలను దొంగిలించిన అమ్మడు హెబ్భా పటేల్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. అయితే చేసిన సినిమాల్లో అందాలతో అలరిస్తున్నా సరైన ఇమేజ్ సంపాదించలేకపోయింది. ఇక ప్రస్తుతం అమ్మడు నటించిన ఏంజెల్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా తప్ప హెబ్భా తెలుగులో ఏ సినిమా చేయట్లేదు. వరుణ్ తేజ్ తో చేసిన మిస్టర్ హిట్ అయితే ఆఫర్లు వచ్చే అవకాశం ఉండేదేమో కాని అది ఫ్లాప్ అవడంతో హెబ్భాకు ఛాన్సులు కరువయ్యాయి. ఇక తెలుగులో దాదాపు కెరియర్ అటకెక్కినట్టు అనిపించిన హెబ్భా తమిళంలో కాస్త ఊపందుకునేలా ఉందట. అక్కడ రెండు సినిమాలు ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్నాయట.

తెలుగులో సడెన్ గా ఎందుకు అమ్మడికి అవకాశాలు రావట్లేదో కాని కుమారికి కోలీవుడ్ గాలి మళ్లిందని అంటున్నారు. ఏంజెల్ హిట్ అయితే అయినా తెలుగులో హెబ్భాకు మళ్లీ అవకాశాలు వస్తాయేమో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news