Movies" ఈ నగరానికి ఏమైంది " రివ్యూ & రేటింగ్

” ఈ నగరానికి ఏమైంది ” రివ్యూ & రేటింగ్

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న తరుణ్ భాస్కర్ తన రెండవ ప్రయత్నంగా ఈ నగరానికి ఏమైంది సినిమా చేశాడు. నలుగురు కొత్త కుర్రాళ్లతో తరుణ్ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అన్నది ఈనాటి సమీక్షలో చూద్దాం. సురేష్ ప్రొడ్క్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో సిమ్రన్ చౌదరీ, అనీషా అంబ్రోస్ నటించారు.

కథ :

వివేక్ (విశ్వజ్ సేన్), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్) నలుగురు మంచి స్నేహితులు. కార్తిక్ క్లబ్ లో పనిచేస్తుంటాడు. కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తూ యాక్టింగ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి వీడియోలను ఎడిట్ చేస్తుంటాడు. వివేక్ దర్శకుడిగా ఎదగాలని అనుకుంటాడు. ప్రేమ విఫలమవడంతో మద్యానికి బానిసవుతాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు అతన్ని మళ్లీ మాములు మనిషిగా మార్చడానికి గోవా ట్రిప్ వేస్తారు. అక్కడ ఏం జరిగింది.. స్నేహితులంతా కలిసి ఏం చేశారు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

నలుగురు కొత్త కుర్రాళ్లే కాబట్టి వారి నుండి తరుణ్ మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు. లీడ్ రోల్ గా విశ్వక్ సేన్ మంచి నటన కనబరిచాడు. కౌశిక్ పాత్రలో చేసిన అభినవ్ గోమఠం కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. మిగతా పాత్రలన్ని సహజ నటనతో ఆకట్టుకున్నారు. వివేక్ లవర్స్ గా చేసిన సిమ్రాన్, అనీషా కూడా మంచిగానే నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమా అంతా చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. వివేక్ సాగర్ పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెండీగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు మ్యాజిక్ ను రిపీట్ చేశాడని చెప్పొచ్చు. సినిమా అంతా సరదాగా సాగుతూనే చివరకు మెసేజ్ ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

నలుగురు యువకుల కథతో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. పెళ్లిచూపులు తర్వాత తరుణ్ భాస్కర్ చేసిన ఈ సినిమా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుత యువత ఆలోచనలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉన్నాయని చెప్పొచ్చు.

సినిమా మొదటి భాగం అంతా సరదాగా సాగుతుంది.. అయితే సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే కథ, కథనాల్లో ఇన్వాల్వ్ అయితే ఏమి అనిపించదు. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ కోసమే ఈ సినిమా వచ్చిందని చెప్పాలి. నలుగురు కొత్తవాళ్లే అయినా బాగా చేశారు.

సినిమా కథ, కథనాల్లో దర్శకుడు మరోసారి తన పనితనం చూపించాడు. రన్ టైం కూడా కలిసి వచ్చే అంశమే. మొత్తానికి పెళ్లిచూపులు తర్వాత ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ యాక్టర్స్ నటన

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కామెడీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

ప్రేమకథ

బాటం లైన్ :

ఈనగరానికి ఏమైంది.. మరో పెళ్లిచూపులు..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news