బాహుబలి ని బీట్ చేయనున్న బూతు కథ టీజర్..!

33

మామూలుగానే ఒక వయసుకు వచ్చిన కుర్రవాళ్ళంతా అస్లీలం, శృంగార విషయాలు తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. చాటుమాటునో వాటి గురించి తెలుసుకుంటూ ఆనందపడుతున్నారు. అయితే అటువంటి కుర్ర కారులో మరింత కంగారు పుట్టించేలా ” ఏడు చేపల కథ’ పేరుతో విడుదలయిన ట్రీజర్ ఇప్పుడు కుర్రవాళ్ళను కంగారు పెట్టేస్తోంది. అంతే కాదు యూట్యూబ్ లో విడుదలయిన ఈ ట్రీజర్ భారీ వ్యూస్ తో షేక్ చేస్తోంది.

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో శృంగార దృశ్యాలు, లిప్పు లాక్ లు సర్వ సాధారణం అయిపోయాయి. అవి చూడడానికి సాధారణముగా అన్ని వయసుల వారు అలవాటుపడిపోయారు. ఇక బాలీవుడ్ సంగతి ఐతే చెప్పక్కర్లేదు. అడల్ట్ కంటెంట్ తో ఏడైనా సినిమా వస్తుందంటే దాని గురించి తెలుసుకోవడానికి .. ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని కుర్రోళ్ళు కంగారు పడుతుంటారు. దీనికి ఏడు చేపల కథ’ ట్రీజర్ ఉదాహరణ.

ఏడుచేప‌ల క‌థ’ టీజ‌ర్‌కి కుర్ర‌కారంతా ఫుల్ ఛార్ట్‌తో యాక్టివేట్ కావడంతో యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 16 మిలియ‌న్స్ (దాదాపు కొటి అర‌వై ల‌క్ష‌లు ) వ్యూస్ రావ‌టం అతిపెద్ద రికార్డుగా నిలిచిపోయింది.ఇదే విధంగా వ్యూస్ వస్తే బాహుబలి ని బీట్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు.ఇందులో ఆడవారిని చూస్తే..టేమ్ట్ అయ్యే యువకుడు కొంత మంది ఆడవాళ్లతో ఎలా ప్రవర్తిసాడు..వాళ్లు అతన్ని ఎలా వాడుకుంటారు అన్న కాన్సెప్ట్ పై రూపొందినట్లు కనిపిస్తోంది.

“ఏడు చేపల కథ” చిత్రంలో టెమ్ట్ రవి అనే విభిన్నమైన పాత్రతో ఇప్ప‌టికే టీజ‌ర్ ద్వారా ఫేమ‌స్ అయ్యాడు. అడల్డ్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్త వారితో రూపోందిన ఈ చిత్రంలో అభిషేక్‌ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటించారు. చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జీవిఎన్ నిర్మిస్తుండగా … శామ్ జే చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a comment