విజయ్ ‘సర్కార్’ రివ్యూ & రేటింగ్

కోలీవుడ్ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్కార్. తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్లు అందుకున్న ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సర్కార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సర్కార్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సర్కార్ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఫారిన్ లో కార్పోరేట్ కంపెనీ సిఈఓ అయిన సుందర్ (విజయ్) తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇండియా వస్తాడు. కాని అతని ప్లేస్ లో ఎవరో తన ఓటు వేసినట్టు గుర్తిస్తాడు. అప్పటి నుండి పొలిటిషియన్స్ మీద పగ బట్టిన సుందర్ ఎలక్షన్స్ రద్దు చేయిస్తాడు. అంతేకాదు తాను కూడా ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడతాడు. ఇంతకీ సుందర్ అసలు టార్గెట్ ఏంటి..? అతను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు..? చివరకు ఏమైంది అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

విజయ్ అన్ని సినిమాల్లానే ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అయితే మురుగదాస్ ఇంకా విజయ్ ను సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. అతని డ్యాన్స్, ఫైట్స్ అభిమానులు ఆశించిన స్థాయిలో ఉండవు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన పాత్ర వరకు న్యాయం చేసింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో మెచ్చుకోవాల్సిన అంశాల్లో మెకెరీ మెన్ పనితనం ఒకటి. ఇక రహమాన్ మ్యూజిక్ ఆకట్టుకోలేదని చెప్పాలి. సినిమా థీం కు ప్రయోగాలు చేసినట్టు కనిపించినా సినిమాకు ఆయన మ్యూజిక్ హెల్ప్ అవలేదు. ఇక సినిమా కథ, కథనాల్లో దర్శకుడు మురుగదాస్ మరోసారి ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. కేవలం విజయ్ కోసం కొన్ని మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో దమ్ము లేదని తెలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.

విశ్లేషణ :

తుపాకి, కత్తి సినిమాల తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చే 3వ సినిమా సర్కార్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సర్కార్ విఫలమైంది. దర్శకుడు మురుగదాస్ కేవలం హీరో ఇమేజ్ ను హైలెట్ చేస్తూ కథ, కథనాల్లో ఏమాత్రం పట్టు లేకుండా చేశాడు.

స్పైడర్ లో మహేష్ ను ఎలా ఆటబొమ్మగా చేశాడో అచ్చం అలానే సర్కార్ సినిమాలో విజయ్ కూడా ఏదో చేస్తూ వెళ్తాడు. హీరో ఇమేజ్ కు తగినట్టుగా కథను.. కథనాన్ని సాగించడంలో దర్శకుడి మురుగదాస్ ఫెయిల్ అయ్యాడు. సినిమా అంతా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సాగుతుంది. అక్కడక్కడ తమిళ పాలిటిక్స్ గురించి ప్రస్థావిస్తారు.

సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. హీరోయిన్ ఉన్నా కేవలం పాటలకే అన్నట్టు ఉంటుంది. రాబోయే పొలిటికల్ సీజన్ కు ఈ సినిమా ఓ సర్ ప్రైజ్ గా ఉంటుంది అనుకుంటే సర్కార్ సినిమా కేవలం హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తగిన సినిమాగా ఉంది. విజయ్ ఫ్యాన్స్ కు తప్ప మిగతా ఆడియెన్స్ కు నచ్చే అవకాశం లేదు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

కొన్ని సీన్స్

బిజిఎం

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

రొటీన్ స్టోరీ

బాటం లైన్ :

విజయ్ సర్కార్.. మురుగదాస్ మరో ఫెయిల్యూర్ అటెంప్ట్..!

రేటింగ్ : 2/5

Leave a comment