ఎవడు మిగిలాడు..ఎవడు పోయాడు…

result of three movies

యువ హీరోలందరు సత్తా చాటేందుకు తమ సినిమాలతో ఒకేసారి ఫైటింగ్ కు దిగారు. లాస్ట్ వీకెండ్ లో నాని, అఖిల్ ఒక్కరోజు తేడాతో రాగా.. ఈ వారం శిరీష్ ఒక్క క్షణం అంటూ పలకరించాడు. నాచురల్ స్టార్ నాని ఎం.సి.ఏగా రొటీన్ కథతో వచ్చినా నాని రేంజ్ తెలిసేలా ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఆ మరుసటి రోజు హలో అంటూ వచ్చిన అఖిల్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా కలక్షన్స్ మీద మాత్రం ప్రభావితం చేయలేదు.

నాని, అఖిల్ ల ఫైట్ ఓ రకంగా వన్ సైడ్ అన్నట్టు కాకుండా రెండు సినిమాలకు మంచే జరిగిందని చెప్పొచ్చు. ఇక మరో పక్క ఈ వారం వచ్చిన ఒక్క క్షణం.. కథా వస్తువు బాగున్నా కథనంలో కాస్త దర్శకుడు తడపడినట్టు తెలుస్తుంది. సినిమా ఓవరాల్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ ఎలా ఉంటాయన్నది మాత్రం చెప్పలేం అంటున్నారు.

మూడు సినిమాలు ముగ్గురు హీరోలకు మంచి ఫలితాలనే ఇవ్వగా వీటిలో ఆర్డర్ వైజ్ తీసుకుంటే మాత్రం నాని ఎం.సి.ఏనే రేసులో ముందు ఉన్నాడు. ఇక అఖిల్ హలో, శిరీష్ ఒక్క క్షణం రెండు కూడా సమానంగా కలక్షన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇయర్ ఎండింగ్ మూవీ ధమాకా కోసం ఎదురుచూసిన సిని ప్రేమికులు అందుకు తగిన సాటిస్ఫ్యాక్షన్ తోనే పాత సంవత్సరానికి బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పబోతున్నారు.

Leave a comment