Gossipsపవన్ వద్దు..! ఎన్టీఆర్ అంటే ముద్దు..!

పవన్ వద్దు..! ఎన్టీఆర్ అంటే ముద్దు..!

సునీల్ .. హీరోగా కంటే కమెడియన్ గానే ఎక్కువమందికి సుపరిచితం. తన కామెడీతో అందరిని కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఆ తరువాత హీరోగా మారిపోయాడు. ఒకటి రెండు సినిమాలు కాస్త పర్వాలేదు అనిపించినా ఇక ఎక్కువ కాలం హీరో గా నిలబడే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు అందుకే ఇప్పుడు రూటు మర్చి మళ్ళీ కమెడియన్ గా మారేందుకు సిద్దమయ్యాడు.

పవన్ హీరో గా వస్తోన్న అజ్ఞాతవాసి సినిమాలో ముందు సునీల్న నటిస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో సునీల్ ఇప్పటికి స్పందించాడు. నేను నిజంగానే అజ్ఞాతవాసిలో నటించాల్సి ఉంది దీనిలో భాగంగానే .. త్రివిక్రమ్‌కు, తనకు మధ్య ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయి అని సునీల్ చెప్తున్నాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఈ సినిమాలో నటించే అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని సునీల్ క్లారిటీ ఇస్తున్నాడు.

పవర్ స్టార్ సినిమాలో నాకు నటించే అవకాశం దక్కకపోయినా… త్రివిక్రమ్ తరువాత తీయబోయే సినిమాలో మాత్రం నాకు ఒక పాత్ర ఉంటుందని, అందులో నేను తప్పకుండా నటిస్తాను అని సునీల్ చెప్తున్నాడు. . పవన్‌తో నటించడం కుదరకపోయినా … జూనియర్ ఎన్టీఆర్‌తో మాత్రం తప్పకుండా నటిస్తానని సునీల్ ధీమాగా చెప్తున్నాడు. హీరో నుంచి కమెడియన్‌కు మారే క్రమంలో తన పాత్ర గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news