‘విజేత’ టీజర్.. మెగా ఫ్యామిలీలో మరో స్టార్ వచ్చేశాడు..!

vijetha-teaser

మెగాస్టార్ చిరజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా విజేత. రాజేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సినిమాలో కళ్యాణ్ దేవ్, మురళి శర్మలు తండ్రి కొడుకులుగా నటించారు. టీజర్ చూస్తుంటే ఇదో ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీగా వస్తుందని అనిపిస్తుంది. హీరోయిన్ గా మాళవిక నాయర్ అందంగా ఉంది.

నిమిషన్ టీజర్ తోనే తనలోని స్టఫ్ ఏంటో చూపించి ఇంప్రెస్ చేశాడు కళ్యాణ్ దేవ్. తప్పకుండా మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ వచ్చేసినట్టే. ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే రాజమౌళి కన్నుగా పేరు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ సినిమాకు కెమెరా మన్ గా పనిచేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ గా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. మరి టీజర్ తో సూపర్ అనిపించేసిన ఈ మెగా హీరో సినిమాలో ఎలా కనిపించి అలరిస్తాడో చూడాలి.

Leave a comment