టివి నటి రాగ మాధురిపై దాడి..కారణం అదేనా?

40

టెలివిజన్ రంగంలో తనదైన సత్తా చాటుతున్న నటి రాగ మాధురిపై ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతిక తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల బంజరా హిల్స్ లో తెలుగు టివి సీరియల్ జరుగుతుంది. అందులో ముఖ్యపాత్రలో రాగ మాధురి నటిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆమె బంగారు గొలుసు కనిపించకుండా పోయింది..దాంతో సెట్ లో అంతా వెతికి చూసినా ఫలితం లేకుండా పోయింది.

ఈ విషయంపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మాధురి. అయితే గొలుసు పోయిన ఘటనలో ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా అని పోలీసులు అడుగగా హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హెయిర్ డ్రెసర్ జ్యోతికను స్టేషన్ కి తీసుకువచ్చి విచారిస్తున్న సమయంలో రాగ మాధురి గొలుసు ఆమె కారులో దొరికిందని సెట్ లో ఉన్నవారు పోలీసులకు అప్పగించి జ్యోతికను తీసుకు వెళ్లారు.

తనను ఘోరంగా అవమానించిందన్న కోపంతో జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. కాగా, తనపై దారుణంగా దాడి చేశారని బంజారాహిల్స్ పోలీసులకు రాగమాధురి మరోమారు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Leave a comment