సాహో వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఇది కదా ప్రభాస్ స్టామినా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా సాహో. ఆగష్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్టు తెలుస్తుంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి సాహో 500 కోట్లు బిజినెస్ చేస్తుందట. థియేట్రికల్ రైట్స్ మొత్తం 320 కోట్ల రూపాయలు అన్ని భాషల్లో కలిపి చేయగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 200 కోట్లు దాకా బిజినెస్ చేసిందట.

ఈమధ్యనే రిలీజైన టీజర్ కూడా అంచనాలను ఏర్పరచింది. అందుకే సాహో కచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుందని భారీ మొత్తం ఇచ్చి ఆ సినిమా కొనేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

ఏరియాల వైజ్ బిజినెస్ డీటైల్స్ చూస్తే :

ఏపి/తెలంగాణా : 120 కోట్లు

కర్ణాటక : 29 కోట్లు

నార్త్ ఇండియా : 100 కోట్లు

తమిళనాడు అండ్ కేరళ : 25 కోట్లు

ఓవర్సీస్ : 45 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ : 320 కోట్లు

Leave a comment