Gossipsఒక్క కేసు.. కోటి రూపాయిలు..!

ఒక్క కేసు.. కోటి రూపాయిలు..!

సౌత్ లో క్రేజీ బ్యూటీ అయిన త్రిషా కొన్నాళ్లుగా ఇన్ కం ట్యాక్స్ సంబందిత కేసుపై పొరాడుతూనే ఉన్న విషయం తెలిసిందే. 2010-11 సంవత్సరానికి గాను త్రిష పలు ఆదాయాలను చూపించలేదని కేసు వేశారు. ఐటి శాఖ త్రిష మీద 1 కోటి 11 వేల రూపాయలు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంపై హైకోర్టుకి వెళ్లిన త్రిష క్లీన్ చిట్ అందుకుంది.

ఆమె అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం కూడా లేదని.. ఆమె పన్నులను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టలేదని వాటికి సంబందించిన పూర్తి ఆధారాలు త్రిష సమర్పించిందని హైకోర్ట్ ఈ కేసు కొట్టేసింది. ఐటి శాఖ తన మీద చేసిన ఈ అభియోగాలన్ని తప్పని తేల్చేసింది త్రిష. ఈమధ్య సినిమాలను తగ్గించేసిన అమ్మడు మళ్లీ పెళ్లి మీద ద్యాస మళ్లించుకుందని అంటున్నారు.

మూడేళ్ల క్రితం ఓ బిజినెస్ మెన్ తో పెళ్లికి సిద్ధమైన త్రిష ఎంగేజ్మెంట్ తర్వాత అతనితో తెగదెంపులు చేసుకుంది. సినిమాల్లో రాణించాలని చూస్తున్నా సరైన బ్రేక్ రావట్లేదు. ఏదో అదపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది అమ్మడు. కేసు గెలవడంతో ఈ సందర్భంగా గోవాలో తన స్నేహితులకు ఓ పెద్ద పార్టీ ఎరేంజ్ చేస్తుందట త్రిష.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news