Gossipsటాలీవుడ్ లో మరో విషాదం..! రోడ్డు ప్రమాదంలో నటుడు సునీల్‌...

టాలీవుడ్ లో మరో విషాదం..! రోడ్డు ప్రమాదంలో నటుడు సునీల్‌ మృతి

ప్రముఖ వర్ధమాన బుల్లి తెర నటుడు నన్నం సునీల్‌(24) రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం కారు యాక్సిడెంట్ లో స్పాట్ లోనే మృతి చెందాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్లపాడు గ్రామం వద్ద జరిగిన కారు ప్రమాదం లో ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న సమయం లో అనుకోకుండా మరొక వాహనం డీ కొనటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు వివరించారు.కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్‌ హైదరాబాద్‌లో కొన్ని సినిమాలకి సంగీత దర్శకుడిగా పనిచేసారు, బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి వాస్తవ్యుడు అయినా సునీల్ కొన్ని రోజుల నుండి అతని వద్ద సంగీతం లో శిక్షణ పొందుతున్నాడు.అలాగే దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీవీ సీరియళ్లు, సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

అయితే షకీల్‌ తమ్ముడు సలావుద్దీన్‌ నెల్లూరులోని ఒక కంపెనీ లో ఇంటర్వ్యూ నిమిత్తం వెళుతుండగా సునీల్‌ అతనితో పాటు సొంత ఊరికి వద్దామని అనుకుని షకీల్ తో కారు లో బయల్దేరాడు. రాచర్లపాడు వద్దకు వీరు ఇద్దరు ప్రయాణిస్తున్న వాహనం చేరుకోగానే ఒక గుర్తు తెలియని మరో వాహనం వీరి కారు ని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సునీల్ తీవ్రంగా గాయపడి ఘటన స్థలం లోనే మృతి చెందాడు. అతని స్నేహితుడు సలావుద్దీన్‌ ప్రస్తుతం కోమాలో ఉన్నారు. ఇది చుసిన స్థానికులు వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వారు తక్షణం ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త తెలిసిన వెంటనే కొంత మంది సంగీత దర్శకులు మరియు సినీ కళాకారులూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

https://youtu.be/Prc9WVVzF_A

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news