టాలీవుడ్ లో 2017కలెక్షన్స్ లో మొదటి స్థానం ఎవరిది..?

tollywood collections

బాలీవుడ్ తరువాత ఆ రేంజ్ లో ఉంది మన తెలుగు సినీ పరిశ్రమ. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే రూపొందుతున్నాయి. తెలుగు సినిమాల మార్కెట్ కేవలం ఆంధ్రప్రదేశ్‌‌కే పరమితం కాలేదు. కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయ్యింది. అందుకే అసలు మన తెలుగు హీరోల సినిమాల కలెక్షన్ లు ఏ రేంజ్ లో ఉన్నాయి..? ఇందులో ఏ హీరో టాప్ లో ఉన్నాడు అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం!
మన హీరోల చివరి మూడు సినిమా ల కలెక్షన్స్ పరిగణలోకి తీసుకుంటే ..! యంగ్ తారకరాముడు అందరికంటే టాప్ పొజిషన్లో ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అయిదుగురు టాప్ హీరోల చివరి మూడు సినిమాల కలెక్షన్ల మాత్రమే ఇందులో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అన్నట్టు ఈ లిస్ట్ లో బాహుబలి సినిమా ను తప్పించడం జరిగింది. ఎందుకంటే అది కేవలం టాలీవుడ్ రేంజ్ లో లెక్కేసే సినిమా కాదు కాబట్టి.
1.ఎన్టీఆర్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
జైలవకుశ—-81.5 కోట్లు
జనతాగ్యారేజ్—–85 కోట్లు
నాన్నకుప్రేమతో—-55.60 కోట్లు
టోటల్ 3 మూవీస్ కలెక్షన్స్ 222 కోట్లు
2. అల్లుఅర్జున్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
దువ్వాడ జగన్నాథం—-71.6 కోట్లు
సరైనోడు—-76 కోట్లు
సన్ ఆఫ్ సత్యమూర్తి—–52.24 కోట్లు
టోటల్ 3 మూవీస్ కలెక్షన్స్ 199.84 కోట్లు

3. మహేష్ బాబు లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
స్పైడర్—-64 కోట్లు
బ్రహ్మోత్సవం—–37 కోట్లు
శ్రీమంతుడు——–87 కోట్లు
టోటల్ మూడు సినిమాల కలెక్షన్స్ 188 కోట్లు

4. పవన్ కళ్యాణ్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
కాటమరాయుడు—–62.50 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్—-52.60 కోట్లు
గోపాలగోపాల – 42.70 కోట్లు
మొత్తం మూడు సినిమాల కలెక్షన్స్ 157.60 కోట్లు
5. రామ్ చరణ్ లాస్ట్ 3 మూడు సినిమాల కలెక్షన్స్::-
ధృవ—–58.4 కోట్లు
బ్రూస్ లీ—-41 కోట్లు
గోవిందుడుఅందరివాడేలే—–40.60 కోట్లు
టోటల్ మూడు సినిమాల కలెక్షన్స్ 140 కోట్లు

ఈ లెక్కలనీ పరిగణలోకి తీసుకుంటే … నందమూరి యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానం సంపాదించగా … ఆ తరువాత స్థానాన్ని అల్లు అర్జున్, దక్కించుకున్నాడు. అయినా ఈ మధ్య ఈ యంగ్ హీరోలు వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఇండ్రస్ట్రీలో దూసుకుపోతున్నారు.

Leave a comment