బాంబు పేల్చిన తాప్సీ… ఎవ‌రా టాలీవుడ్ హీరో

30

పంజాబీ చిన్న‌ది తాప్పీకి వివాదాలు కొత్తేం కాదు. ఆమె సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లోనే ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావునే టార్గెట్ చేసింది. త‌న బొడ్డుపై కొబ్బ‌రికాయ‌లు కొట్టి ఆయ‌న ఆనందం పొందార‌ని చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం అయ్యాయి. చాలా రోజుల త‌ర్వాత తాప్పీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతోంది. ఆనందో బ్ర‌హ్మ మంచి హిట్ అయ్యింది. ప్ర‌స్తుతం ఆమె గేమ్ ఓవ‌ర్ లాంటి మ‌రో లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేసింది.

ఈ సినిమాకు మంచి టాక్‌తో పాటు మూడు భాష‌ల్లోనూ మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఈ సినిమా జోష్‌తో ఉన్న ఆమె ఓ టాలీవుడ్ హీరోను ఇష్యూలోకి లాగింది. ఆమెకు గ‌తంలో ఓ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఓకే చెప్పాక‌… కొద్ది రోజుల త‌ర్వాత నిర్మాత‌లు వ‌చ్చి… ఆ హీరోకు అంత మార్కెట్ లేదు… మీరు కాస్త పారితోష‌కం త‌గ్గించుకోమ‌ని చెప్పార‌ట‌.

ఇలా అడ‌గ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటోన్న ఆమె… ఈ ప‌ద్ధ‌తి మారాల‌ని.. అందుకే తాను ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ వైపు మ‌ళ్లాన‌ని చెపుతోంది. అందుకే హీరోతో సంబంధం లేకుండా క‌థ అంతా నా చుట్టూ తిర‌గాల‌నే ఈ సినిమాల్లో న‌టిస్తున్నానంది. తాప్సీ పేల్చిన తాజా బాంబుతో ఇప్పుడు ఆ హీరో ఎవ‌రు ? అన్న‌దాని చుట్టూనే ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది. ఇంత‌కు తాప్పీ గ‌తంలో చేసిన సినిమాల్లో ఏ హీరో న‌టించాడా ? అని అంద‌రూ ఆరాలు పేరాలు తీస్తున్నారు.

Leave a comment