ఆ స్టార్ హీరో ఫ్యామిలీలో గొడ‌వ‌లే… భార్య‌తో మాట‌ల్లేవ్‌..

బాలీవుడ్లో ఒకప్పటి రొమాంటిక్ హీరో షాహిద్ కపూర్ ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. అప్పట్లో టాప్ హీరోయిన్లుగా ఉన్న వాళ్లు సైతం షాహిద్‌క‌పూర్తో రొమాంటిక్ సినిమాలు చేసేందుకు ఎంతో ఇష్టపడే వారు. తాజాగా తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో షాహిద్ న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ల‌లో బిజీబిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే త‌న వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడాడు.

అందరి భార్య భర్తల్లాగానే తాను తన భార్య మీద ప్రతి 15 రోజులకు ఒకసారి బాగా గొడవ పడుతూ ఉంటామ‌ని… ఆ టైంలో ఇద్దరం విడివిడిగా ఉంటామని… 15-20 రోజుల పాటు కూడా మాట్లాడుకొని సందర్భాలు ఉన్నాయ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని మళ్లీ కలిసి పోతాం అని చెప్పాడు. క‌నీసం రెండు, మూడు నెల‌ల‌కు ఒక‌సారి అయినా త‌మ మ‌ధ్య చిన్న‌చిన్న గొడ‌వ‌లు పెద్ద‌గా మారిపోయి.. అవి తాము మాట్లాడుకోవ‌డం మానేసే వ‌ర‌కు వెళ‌తాయ‌ని షాహిద్ చెప్పాడు.

ఇక గొడ‌వ స‌ద్దుమ‌ణిగి… ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ కొన్నాళ్లకు గొడవ పడుతూ ఉంటాం. భార్య‌, భ‌ర్త‌లు అన్నాక అప్పుడ‌ప్పుడు గొడ‌వ ప‌డుతూనే ఉండాల‌ని.. వెంట‌నే క‌లిసిపోవాల‌ని అప్పుడు దాంప‌త్య జీవితానికి అస‌లైన అర్థం ఉంటుంద‌ని.. స‌రికొత్త జీవిత సూత్రాన్ని షాహిద్ చెప్పాడు.

Leave a comment