ఆ ప్రశ్నకు అదిరిపోయే జవాబిచ్చిన రజనీకాంత్!!

rajinikanth superb answer

Recently ‘2.0’ movie unit has launched the brand new first look poster in Mumbai. In this event one journalist has asked a question to Rajinikanth which is very difficult to give answer. But Rajini has handled that question by giving the simple answer for which audience gave him applause.

సాధారణంగా స్టార్ హీరోలు ఏవైనా ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలకు అటెంట్ అయినప్పుడు.. మీడియా నుంచి వారికో విచిత్రమైన ప్రశ్న ఎదురవుతుంది. చాలామంది ఆ ప్రశ్నకు జవాబివ్వలేక సతమతమవుతుంటారు. ఏం సమాధానం చెప్పాలో తెలీక కాసేపు మౌనం పాటిస్తారు. ఆ తర్వాత తెలివిగా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేస్తారు. కానీ.. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం అలా చేయలేదు. సింపుల్‌గా జవాబిచ్చి అందరినోళ్లు మూయించేశారు. దీంతో.. అక్కడున్న వాళ్లందరూ శెభాష్ అంటూ చప్పట్లతో ప్రశంసించారు.

ఇంతకీ.. ఆ ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా! మరేదో కాదు.. ‘మీలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరని భావిస్తున్నారు?’ అనే ప్రశ్న స్టార్ హీరోల్ని చిక్కుముడిలో పడేస్తుంది. ఈ ప్రశ్న ఎదరైనా ప్రతిసారీ హీరోలందరూ బిక్కుబిక్కుమంటూ చూస్తుంటారు. కానీ.. రజనీ మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చి ఔరా అనిపించారు. రీసెంట్‌గా ముంబైలో ‘2.0’ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం కోసం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆ ప్రశ్న రజనీకాంత్‌కి ఎదురైంది. అందుకు ఆయన ఏం సమాధానం ఇస్తాడా? ఏ స్టార్ హీరో పేరు తీసుకుంటాడా? అని రెండు సెకన్లపాటు ఉత్కంఠలో మునిగిపోయారు. ఆ మూడో సెకను ఆయనిచ్చిన జవాబు విని.. చప్పట్లు కొట్టారు.

ఇంతకీ ఆయనిచ్చిన జవాబేంటో తెలుసా? ‘నో కామెంట్స్’. అవును.. ఆయనిచ్చిన జవాబు అదే. ఎవరిదైనా ఒకరు పేరు తీసుకుంటే.. మరొకరి మనోభావాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో.. ఎవరూ పేరు చెప్పకుండా సింపుల్‌గా ‘నో కామెంట్స్’ అని చెప్పేశారు. ఆయనిచ్చిన ఈ ఆన్సర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Leave a comment