Moviesసాయి రామ్ శంకర్ , నికిషా పటేల్ ల `అర‌కు రోడ్...

సాయి రామ్ శంకర్ , నికిషా పటేల్ ల `అర‌కు రోడ్ లో` రిలీజ్ డేట్!!

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్య క్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల”మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాద్ గారు ,మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది . సినిమా చూసివారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది . అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది .30 ఇయర్స్ పృద్వి చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు . ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 న అత్యధిక ధియేటర్ లలో రిలీజ్ చేయనున్నాము అని అన్నారు .

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news