ఆ ఫ్రెండ్ కోసం ఎన్టీఆర్ సినిమానే వాడేస్తున్న త్రివిక్రమ్ ..!

ntr suneel

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ 28 వ చిత్రానికి ఈ నెల 23 న రామానాయుడు స్టూడియోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదగా గ్రాండ్ గా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే . ఈ చిత్రం లో ఎన్టీఆర్ సోల్జర్ గా కనబడ నున్నారనే వార్త ఎప్పటినుండో వినిపిస్తుంది, లేటెస్ట్ గా ఈ చిత్రం లో నారా రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినబడుతుందిట .

అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ పాత్రకు సునీల్ ని తెరెపైకి తీసుకొచ్చారట త్రివిక్రమ్ . నిజానికి సునీల్ హీరోగా అస్సలు రాణించలేదు . మల్లి కమెడియన్ గా తన కెరీర్ ని రీస్టార్ట్ చేసే ఆలోచనలో వున్నాడట సునీల్ . వాస్తవానికి సునీల్ ఈ ప్రయత్నం ఎప్పటినించో చెయ్యాల్సి వుంది . ఖైదీ 150 లో ఆలీ చేసిన క్యారక్టర్ సునీల్ చేయాల్సింది , కానీ అప్పటికి వేరే సినిమాలకు కమిట్ అవ్వడంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు సునీల్ . త్రివిక్రమ్ సునీల్ మిత్రులు కావడంతో త్రివిక్రమ్ సినిమాలో అయితే మంచి పాత్ర లభించే అవకాశం ఉందని సునీల్ ఆలోచనట . త్రివిక్రమ్ అందుకు అంగీకరించినట్లు గా కూడా తెలుస్తుంది .

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసే రోల్ సీరియస్ సైడ్ హీరో రోల్ ఆ , లేక కమెడియన్ రోల్ ఆ ఇంకా తెలియాల్సివుంది . త్రివిక్రమ్ రాసిన చిరునవ్వుతో చిత్రం తోనే సునీల్ ఫేమస్ అయ్యారు. మళ్ళీ ఆ త్రివిక్రమ్ ఏ సునీల్ ని కడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయించనున్నారని సినీ వర్గాల సమాచారం .

Leave a comment