Gossipsఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్..

ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్..

రెండేళ్ల గ్యాప్ తో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ రవితేజకు హిట్ కిక్ ఇచ్చింది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాటు విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట.

ఇక ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రవితేజ డిసెంబర్ నుండి తను కమిట్ అయిన తమిళ సినిమా బోగన్ రీమేక్ కూడా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. తమిళ దర్శకుడే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అయితే అక్కడ అరవింద్ స్వామి పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నాడని అన్నారు. అఫిషియల్ గా మాత్రం చెప్పలేదు.

ఈ రెండు సినిమాలే కాకుండా శ్రీను వైట్లతో పాటుగా సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కూడా సినిమా చేస్తాడట రవితేజ. మొత్తానికి రెండేళ్లు గ్యాప్ వచ్చినా మళ్లీ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేలా అదిరిపోయే షెడ్యూల్ ప్లాన్ చేశాడు మాస్ రాజా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news