ఎన్టీఆర్ కే ఆ దమ్ముంది.. మిగతా వారంతా వేస్టేనా..!

sree-comments-on-ntr

స్టార్ హీరోలు బుల్లితెర మీదకు వస్తే ఇమేజ్ దెబ్బతింటుంది అన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ సీజన్ 1 ను సూపర్ సక్సెస్ చేశారు. తారక్ హోస్టింగ్ టాలెంట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బుల్లితెర ఆడియెన్స్ కూడా భలే ఎంజాయ్ చేశారు. ఇక ఈ సెకండ్ సీజన్ లో తారక్ బదులుగా నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నాడు.

ఓ మోస్తారుగా నాని యాంకరింగ్ ఉందని తెలుస్తుంది. అయితే అసలే నాని అంటే ఇంత ఎత్తున లేస్తున్న శ్రీరెడ్డి మళ్లీ నానిని దెబ్బకొట్టేలా బిగ్ బాస్ లో ఎన్.టి.ఆర్ లేకుండా ఎలా చూడాలో అర్ధం కావట్లేదు. ఎన్.టి.ఆర్ ఒక్కడికే ఆ దమ్ముంది అంటూ కామెంట్స్ చేస్తుని. తెలుగు ఆడియెన్స్ అంతా తారక్ ను మిస్ అవుతున్నారని.. తారక్ చేసినంతగా షోని నడిపించే దమ్ము ఇంకెవరికి లేదని అంటుంది శ్రీరెడ్డి.

చూస్తుంటే ఇది పక్కాగా నానిని ఎసరు పెట్టేలా శ్రీరెడ్డి ప్లాన్ అని తెలుస్తున్నా.. ఎన్.టి.ఆర్ ను ఆడియెన్స్ మిస్ అవుతున్న మాట మాత్రం వాస్తవం. స్టార్ హీరో అయ్యుండి తారక్ చాలా కలివిడిగా హౌజ్ లోని కంటెస్టంట్స్ తో మాట్లాడాడు. మరి నాని తర్వాత వాతమైనా డెవలప్ అవుతాడో లేదో చూడాలి.

Leave a comment