పేటిఎం వాడేవారు జాగ్రత్త..పేటిఎంలో 10 కోట్ల మోసం..?

87

ఈ కామర్స్, డిజిటల్ వాలెట్ పేటిఎం మాల్ లో భారీ మోసం జరిగినట్టు సంస్థ అధికారులు గుర్తించడం జరిగింది. క్యాష్ బ్యాక్ రూపంలో 5 రూపాయల నుండి 10 కోట్ల దాకా మోసం జరిగినట్టు కంపెనీ వెళ్లడించింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక టూల్ తో ఈ మోసం బయట పడ్డట్టు తెలుస్తుంది.
1
కొందరు చిరు వర్తకులకు భారీగా క్యాష్ బ్యాక్ వస్తున్న విషయాన్ని గుర్తించాం.. అయితే దీనిపై విచారణ చేపట్టగా 10 కోట్ల మోసం బయటపడింది. సంస్థలో కొంతమంది కింద స్థాయి ఉద్యోగులు వారికి సహకరించినట్టు తెలిసింది. ఫేక్ ఆర్డస్ర్స్ సృష్టించి దాని ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చేలా చేశారని.. దాదాపు 100 మంది ఇలా తమ ఫ్లాట్ ఫాం నుండి తొలగించారని అన్నారు. అంతేకాదు కొందరు ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించినట్టు తెలుస్తుంది. ఇక్ ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చేస్తామని అన్నారు.
2
ఇప్పుడు అందరు ఏ వస్తువు కొనాలన్న ఈ కామర్స్ సైట్స్ మీద ఆధారపడుతున్నారు. అందుకే దాన్ని అదునుగా చూసుకుని ఈ స్కాం చేసినట్టు తెలుస్తుంది. పేటిఎం వాలెట్ లో 10 కోట్ల దాకా మోసం అని తెలియగానే మిగతా ఈ కామర్స్ సైట్స్ కంగారు పడుతున్నాయి. తమ కంపెనీలోని ఉద్యోగులే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
3

Leave a comment