రానాకు అక్కడేం పని పడిందో ?

స్టార్ నిర్మాత డి రామానాయుడు ఇంటి నుంచి హీరోగా వెంకటేష్ తర్వాత డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్ ’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా మంచి హిట్ అయ్యింది..ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో హీరో ఇమేజ్ ని ఏమాత్ర ఫాల అవ్వకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాల్లో నటించాడు.

అంతే కాదు రాజమౌళి తీసిన బాహుబలి సీరీస్ లో ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రభాస్ కి సమానంగా పేరు తెచ్చుకున్నాడు. నార్త్ లో ప్రభాస్ తో సమానంగా ఇతనికీ గుర్తింపు వచ్చింది. అందుకే బాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 పూర్తి చేసి దాని విడుదల కోసం ఎదురు చూస్తున్న రానా. ఈ సినిమాతో మారో మూవీ హాతీ మేరె సాథీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏనుగు నేపధ్యంలో రూపొందుతున్న ఈ క్లాసిక్ రీమేక్ మీద అక్కడ అంచనాలు భారీగానే ఉన్నాయి.

కాగా, నిన్న రానా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంటి నుంచి రావడం కెమెరా కంటికి చిక్కింది. దాంత రానాపై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదో కీలకమైన ప్రాజెక్ట్ కోసం మీటింగ్ జరిగినట్టు మాత్రం అర్థమవుతోంది. రానాతో కరణ్ జోహార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. ఆ మద్య ప్రభాస్ ని బాలీవుడ్ లో డైరెక్ట్ గా ఓ సినిమాలో నటించాని కోరారు కరణ్ జోహార్..కానీ ప్రభాస్ మాత్రం టాలీవుడ్ కే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానా ఎలాంటి ప్లానింగ్ లో ఉన్నార మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Leave a comment