సంక్రాంతి విన్నర్ ఎవరో తెలిస్తే షాకే..?

sankranthi winner
టాలీవుడ్ లో పొంగల్ వార్ అంటే చాలా ఆసక్తి ఉంటుంది. కొత్త సంవత్సరంలో మొదట వచ్చే పండుగని సినిమా పండుగ చేసేలా వరుస సినిమాలు రిలీజ్ చేస్తారు. సంక్రాంతి బరిలో ఈసారి మూడు స్ట్రైట్ సినిమాలతో పాటుగా ఓ డబ్బింగ్ సినిమా వస్తుంది. పవన్ అజ్ఞాతవాసి, బాలకృష్ణ జై సింహా, రాజ్ తరుణ్ రంగులరాట్నంతో పాటుగా సూర్య గ్యాంగ్ రిలీజ్ అవుతున్నాయి.
సంక్రాంతి బరిలో పవన్ సంచలనం :
ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. పవన్ త్రివిక్రం కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ట్రైలర్, టీజర్ లతో సినిమా రేంజ్ ఏంటో చూపించిన ఈ సినిమా ఓవర్సీస్ లో ఏ ఇండియన్ సినిమా రిలీజ్ అవని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. పక్కా హిట్ ఫార్ములాతో వస్తున్న ఈ అజ్ఞాతవాసి రికార్డులు తిరగరాయడం కన్ఫాం అంటున్నారు.
బాలయ్య జై సింహా :
సంక్రాంతి రాజుగా బాలయ్య పొంగల్ వార్ లో నిలుస్తూ హిట్లు కొడుతూ వస్తున్నాడు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న జై సింహా సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాంబోతున్న ఈ జై సింహా బాలయ్య పొంగల్ సెంటిమెంట్ తో వస్తుంది. నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై సెంటిమెంట్ పండిపోతుందట. అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అదిరిపోతాయని అంటున్నారు.
రాజ్ తరుణ్ రంగులరాట్నం :
రాజ్ తరుణ్ హీరోగా చిత్రా శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా రంగులరాట్నం. అక్కినేని నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి సినిమాపై మంచి బజ్ ఏర్పరచింది. అతిగా ప్రేమించే అమ్మాయికి ఓ ప్రేమికుడు ఎలా బలయ్యాడు అన్న కథతో ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. సంక్రాంతికి స్టార్స్ తో ఫైట్ అంత ఈజీ ఏమి కాదు అయితే ఆ సినిమాలు చూసిన ప్రేక్షకులకు అదనపు ఎంటర్టైనర్ ఇచ్చేందుకు ఈ చిన్న సినిమాలు వస్తున్నాయి.
సూర్య గ్యాంగ్ అదరగొడతాడా :
24 తర్వాత సూర్య నటించిన గ్యాంగ్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. యువి క్రియేషన్స్ వారు తెలుగులో భారీగానే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ నటించింది. రమ్యకృష్ణ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. సిఐడి ఆఫీసర్ అయిన సూర్య కామెడీ ఎంటర్టైనర్ గా ఈ గ్యాంగ్ వస్తుంది. సూర్య మొదటిసారి తెలుగులో సొంత డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
నాలుగు సినిమాల్లో రాజ్ తరుణ్ సినిమాకు తక్కువ బజ్ ఉంది. ఇక పవన్ అజ్ఞాతవాసి గురించి అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాక్ అయితే అజ్ఞాతవాసికే ఎక్కువ ఉంది. బాలయ్య జై సిం హా కూడా భారీగా వస్తుంది. మరి ఫైనల్ గా సంక్రాంతి రాజు ఎవరు అన్నది వేచి చూడాలి.

Leave a comment