ప్రణయ్ పరువు హత్యపై రాం చరణ్ సంచలన ట్వీట్..!

34

తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని మారుతి రావు అమృత భర్త ప్రణయ్ ను సుఫారి ఇచ్చి మరి చంపించిన విషయం తెలిసిందే. కన్నకూతురు భవిష్యత్తు నాశనం చేసిన ఆ తండ్రి ప్రస్తుతం పోలీసుల కష్టడీలో ఉన్నాడు. అయితే ఈ పరువు హత్య గురించి సెలబ్రిటీస్ కూడా స్పందిస్తున్నారు. మంచు మనోజ్, రాం, సింగర్ చిన్మయి ఇప్పటికే ప్రణయ్ హత్య గురించి స్పందించగా లేటెస్ట్ గా రాం చరణ్ కూడా ఈ ఘటనపై సంచలన కామెంట్స్ చేశాడు.

దారుణంగా ప్రాణం తీస్తే పరువు నిలుస్తుందా.. సమాజాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం అంటూ కామెంట్ చేశాడు రాం చరణ్. అమృత వర్షిని కుటుంబానికి తన ప్రగాడ సానుభూతిని ప్రకటించి ప్రేమకు బౌండరీస్ లేవు.. జస్టిస్ ఫర్ ప్రణయ్ హ్యాష్ ట్యాగ్ లతో ట్వీట్ చేశాడు. మొత్తానికి రాం చరణ్ పరువు హత్య మీద తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపరచాడు.

Leave a comment