2.ఓ కథ లీక్.. శంకర్, రజిని మ్యాజిక్ చేస్తారా..!

Robo 2 story leaked

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా 550 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మనుషుల వల్ల పక్షి జాతి అంతమవుతుందని పక్షి జాతి మనుషుల మీద పగ పెంచుకుంటుంది.

వారికి నిత్యావసరమైన సెల్ ఫోన్స్ అన్ని మాయం చేస్తాడు పక్షి రాజు. అయితే ఆ విధ్వసాన్ని ఎదుర్కునేందుకు చిట్టిని మళ్లీ రెడీ చేస్తాడు వసికర్. చిట్టి, పక్షి రాజు మధ్య జరిగే యుద్ధమే 2.ఓ కథ అని తెలుస్తుంది. టీజర్ లో పక్షి రాజుగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. రజినికాంత్ రోబోగా కనిపిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజైన టీజర్ చూస్తే కథ దాదాపు ఇదే అని నమ్మేట్టుగానే ఉంది. భారీ అంచనాలతో వస్తున్న 2.ఓ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment