‘అరవింద’ రెండో పాటకు అంతుందా..?

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదటి పాట అనగనగనగా పాట అందరిని అలరించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఓల్డ్ ట్యూన్ కాపీ కొట్టాడన్న టాక్ వచ్చినా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ దాన్ని హిట్ చేశారు.

అయితే ఈరోజు అరవింద సమేతలోని రెండో పాట పెనివిటి సాంగ్ రిలీజ్ కాబోతుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ అయితే కొన్ని దశాబ్ధాలుగా ఈ పాట మిగిలిపోతుందని అన్నాడు. రామజోగయ్య శాస్త్రి కూడా మళ్లీ చెబుతున్నా మామూలు పాట కాదు.. ఇలాంటి సందర్భాన్ని నాకు ఇచ్చిన త్రివిక్రం కు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి రెండో పాట మీద ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే అరవింద సమేత సినిమా పెనివిటి సాంగ్ పై ఫ్యాన్స్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment