Reviewsరజని కాంత్ " కాలా " సినిమా రివ్యూ రేటింగ్

రజని కాంత్ ” కాలా ” సినిమా రివ్యూ రేటింగ్

కబాలి తర్వాత రజినికాంత్, పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన మూవీ కాలా. ముంబై ధారావి నేపథ్యంతో వచ్చిన ఈ కాలా సినిమాను ధనుష్ నిర్మించారు. హ్యూమా ఖురేషి, ఈశ్వరి రావు ప్రధాన పాత్రలుగా నటించగా.. నానా పటేకర్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ముంబై ధారావి ప్రాంతంలోని ప్రజలు సమస్యలతో బాధపడుతుంటారు. అక్కడ వారికి రక్షకుడిగా రాజాజి కాలా (రజినికాంత్) ఉంటాడు. ధారావి ప్రాంతంలో ప్రజలకు అండగా ఉండే కాలా ప్యూర్ ముంబై వివాదంలో ఇతరులతో గొడవ పడతాడు. ప్రజల మేలుకోరే కాలా వారి కోసం విలన్ హరి దాదా (నానా పటేకర్) తో ఫైట్ కు దిగుతాడు. ఇంతకీ ఈ పోరులో ఎవరు గెలిచారు. తన ప్రజల కోసం కాలా ఏం చేశాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కాలాగా రజినికాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారని చెప్పొచ్చు. తన లుక్ సినిమా మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించినా అదరగొట్టారు. తన పొలిటికల్ కెరియర్ కు ఈ సినిమా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈశ్వరి రావు బాగానే చేసింది. హ్యూమా ఖురేషి ఉన్నంతలో బాగానే అనిపిస్తుంది. హీరోకి సమానంగా విలనిజం ఉంటుంది. నానా పటేకర్ నటన సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక మిగతా పాత్రలన్ని పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

కబాలితో మిస్సైన కథ ఇందులో బాగా రాసుకున్నాడు పా. రంజిత్. కథ కొద్దిగా రొటీన్ గా అనిపించినా కథనం కొత్తగా ఉంటుంది. రజిని స్టైల్ కు తగిన కథగా కాలా వచ్చింది. దర్శకుడు అంచనాలకు తగినట్టుగానే సినిమా తీశాడని చెప్పొచ్చు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. మురళి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమాకు డిఫరెంట్ కలరింగ్ వాడారని అనిపిస్తుంది. డైలాగ్స్ అయితే చాలా చోట్ల వారెవా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. ధనుష్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీశాడని చెప్పొచ్చు.

విశ్లేషణ :

కబాలితో అంచనాలను అందుకోలేని పా. రంజిత్, రజిని కాంబోలో వచ్చిన కాలా ఈసారి పకడ్బంధీ కథ, కథనాలతో వచ్చారని చెప్పొచ్చు. ప్రజల మేరుకోలే కాలాగా రజిని కనిపించారు. చాలా చోట్ల తన పొలిటికల్ కెరియర్ కు ఉపయోగపడేలా ఈ సినిమాలోని డైలాగులు ఉన్నాయనిపిస్తుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కథ గొప్పగా చెప్పకున్నా బాగానే నడిపించాడు. ఇంటర్వల్ ఫైట్ బాగుంది. రజిని ఫ్యాన్స్ కు ఆ ఒక్క ఫైట్ చాలనిపిస్తుంది. మాస్ ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక సెకండ్ హాఫ్ విలన్ ను డీ కొట్టి అతనిపై గెలవడం రొటీన్ గా అనిపించినా ప్రజల విజయంగా చూపించడం బాగుంది.

కథకు తగినట్టుగా పాత్రలున్నాయి. ఎంటర్టైనింగ్ అక్కడక్కడ తగ్గినట్టు అనిపిస్తుంది. కాస్త అరవ వాసన ఎక్కువగానే కొడుతుంది. కబాలి అంచనాలను అందుకోకపోయినా రజిని ఇచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ మాత్రం రంజిత్ చాలా చక్కగా వినియోగించుకున్నాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

రజినికాంత్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

రజినికాంత్ కాలా.. ఈసారి టార్గెట్ మిస్సవ్వలేదు..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news