Gossipsఅరవింద సమేత.. ఎన్టీఆర్, త్రివిక్రం కండీషన్స్ అప్లై..!

అరవింద సమేత.. ఎన్టీఆర్, త్రివిక్రం కండీషన్స్ అప్లై..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశంతో షూటింగ్ చేస్తున్నారు. ఈ దశలో షూటింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దాని వల్ల సినిమా యూనిట్ నుండే ఈ సినిమాకు సంబందించిన కొన్ని లీక్స్ జరుగుతున్నాయి.

ఈమధ్యనే ఎన్.టి.ఆర్, నాగబాబు కలిసి ఎమోషనల్ గా ఉన్న ఓ పిక్ లీక్ అయ్యింది. త్రివిక్రం ఈ లీకుల పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే రాజమౌళి తరహాలో సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్స్ లేకుండా సెట్స్ కు రావాలని కండీషన్ పెట్టారట. రాజమౌళి తన ప్రతి సినిమాకు ఇలానే సెట్స్ కు సెల్ ఫోన్స్ నాట్ ఎలోడ్ అని కండీషన్ పెడతాడు. అందుకే జక్కన్న సినిమా నుండి ఎలాంటి లీక్స్ జరుగవు. ఇక ఈ విధంగా రాజమౌళి ‘అరవింద సమేత’ సినిమాకి అనుకోని విధంగా సహాయపడ్డారనే చెప్పాలి.

ఇక ఇప్పుడు అరవింద సమేత దర్శకుడు త్రివిక్రం కూడా చిత్రయూనిట్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news