Gossipsరాశిఖన్నా తల్లికి విషాదాన్ని మిగిల్చిన శ్రీనివాసకళ్యాణం !

రాశిఖన్నా తల్లికి విషాదాన్ని మిగిల్చిన శ్రీనివాసకళ్యాణం !

నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా కథ విన్న రాశి ఖన్నా తనకు నచ్చడమే కాకుండా ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పిందట. కథ విన్న రాశి మదర్ కన్నీళ్లు పెట్టుకున్నారట.

మనసులను కదిలించే సినిమాలు.. కథలు రావడం అరుదు.. అలాంటి వాటిలో శ్రీనివాస కళ్యాణం ఒకటని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా దిల్ రాజు రాశి ఖన్నాని ప్రిఫర్ చేయగా.. సతీష్ వద్దని అన్నారట. కాని ఆమె నటించిన తొలిప్రేమ సినిమా తర్వాత ఆమెను ఓకే చేయడం జరిగిందట. ఇక శ్రీనివాస కళ్యాణం సినిమా హిట్ అయితే రాశి ఖన్నా మెచ్యుర్డ్ నటి అని ఒప్పుకోవాల్సిందే అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news