ఎంత ఎదిగిన ఎన్టీఆర్ నే ఫాలో అవుతున్న ప్రభాస్..!

25

బాహుబలికి ముందు ప్రభాస్ ఓ తెలుగు స్టార్ హీరో.. కాని బాహుబలి మొదటి రెండు పార్టుల తర్వాత ప్రభాస్ అంటే నేషనల్ స్టార్. యంగ్ రెబల్ స్టార్ గా తన సత్తా చాటిన ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమాను మరో బాహుబలి చేసేందుకు బాగా కృషి చేస్తున్నాడు. నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉన్నా సరే ప్రభాస్ ఇంకా ఎన్.టి.ఆర్ నే ఫాలో అవుతుండటం విశేషం. అదేలా అంటే తారక్ బర్త్ డే నాడు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ నెల రోజుల నుండి స్పెషల్ గ్రీటింగ్స్ ప్లాన్ చేశారు.12

ఇక ఇప్పుడు అదే దారిలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బర్త్ డే కు 100 రోజుల ముందు నుండి హంగామా చేస్తున్నారు. తారక్ బర్త్ డే కు నెల రోజుల ముందు హడావిడి మొదలైతే ప్రభాస్ కోసం 100 రోజుల ముందు నుండి స్టార్ చేశారు ఫ్యాన్స్. ఇంత క్రేజ్ వచ్చినా ప్రభాస్ ఇంకా ఎన్.టి.ఆర్ నే ఫాలో అవుతున్నాడని కొందరు అంటున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే. ఫ్యాన్స్ చేస్తున్న ఈ హంగామాకి ప్రభాస్ తిరిగి ఎలాంటి కానుక ఇస్తాడో చూడాలి. 11

Leave a comment