Moviesసైరాకు పవన్ వాయిస్.. వీడియో వచ్చేసిందోచ్..!

సైరాకు పవన్ వాయిస్.. వీడియో వచ్చేసిందోచ్..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. బాహుబలి తరహాలోనే ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ సంఖ్యలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో సైరా ఒకటి.

అందుకే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది. రీసెంట్ గా వచ్చిన సైరా మేకింగ్ వీడియో సర్ ప్రైజ్ చేయగా ఇక టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ యాడ్ చేస్తున్నారట. అయితే మూడు నాలుగు రోజుల క్రితమే ఈ వార్త రాగా దానికి సంబందించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఇక లేటెస్ట్ గా సైరాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఇస్తున్న వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పవన్ కారులోంచి దిగి డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి వాయిస్ ఓవర్ చెప్పడం.. పవన్ పక్కనే చిరు, సురేందర్ రెడ్డి సలహాలు ఇవ్వడం లాంటివి చూపించారు. ఫైనల్ గా పవన్ బిగ్గర గొంతుతో సైరా నరసిం హా రెడ్డి అని అరవడంతో ఆ వీడియో ముగుస్తుంది. మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కచ్చితంగా సైరా సినిమాకు పవన్ వాయిస్ కూడా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news