చిరు – కొర‌టాల‌కు సినిమాకు బ్రేక్ …!

మెగా స్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా అత్యంత ప్ర‌తిష్టాత్మంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. 200 భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌నున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది.

ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే `సైరా` సినిమాపై తారా స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేదీ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే చిరంజీవి ఈ సినిమా త‌ర్వాత 152వ చిత్రం కోసం కొర‌టాల శివ‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికార్లు కొడుతున్నాయి.

అదే విధంగా కొర‌టాల శివ మంచి సోష‌ల్ మేసేజ్ స్టోరీను చిరు కోసం రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి వెయిట్ కూడా త‌గ్గాడ‌ని స‌మాచారం. నిజానికి ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్కాల్సి ఉంది. కానీ `సైరా` సినిమా, చిరంజీవి పుట్టిన‌రోజు మ‌రియు `సైమా` అవార్డుల ఫంక్ష‌న్ అన్నీ ఒకే సారి రావ‌డంతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి- కొర‌టాల‌ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ప‌డింది.

అలాగే ఈ సినిమాలో చిరంజీవి తండ్రి- కొడుకులుగా డ‌బుల్ పాత్ర‌లో చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఈ చిత్రంలో చిరు సింగిల్ రోల్‌లోనే క‌నిపించ‌బోతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మరోసారి నటించేందుకు ఆమె పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Leave a comment