ఎన్టీఆర్ దెబ్బకు చరణ్ తట్టుకోగలడా.?

2

నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఎన్.టి.ఆర్. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా క్రేజ్ చూస్తే ఈసారి సంక్రాంతికి హంగామా షురూ చేసేలా ఉంది. ఇక ఈ సినిమాకు పోటీగా రాం చరణ్ బోయపాటి శ్రీను సినిమా కూడా సంక్రాంతి రేసులో దిగుతుంది.
3
ఈ సినిమాకు ఎన్.టి.ఆర్ దెబ్బ బాగానే తగిలేలా ఉంది. ఎన్.టి.ఆర్ సినిమా నుండి ఇప్పటికే ప్రమోషన్ మొదలుపెట్టాడు దర్శకుడు క్రిష్. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ, చంద్రబాబుగా రానా లుక్ ఇప్పటికే లీక్ అవగా సినిమాపై అవి భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంతేకాదు బిజినెస్ లో కూడా ఎన్.టి.ఆర్ స్థాయిని చూపించేలా జరుగుతుంది.
2
బయోపిక్ సినిమాల్లో ఎన్.టి.ఆర్ సినిమా ఓ ట్రెండ్ సృష్టించాలని చూస్తుంది. మరోపక్క దీనికి పోటీగా వస్తున్న చరణ్ సినిమా ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. చరణ్ కు ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తుంది.
1

Leave a comment