నైజాంలో షాక్ ఇచ్చిన అజ్ఞాతవాసి.. అయోమయంలో డిస్ట్రిబ్యూట‌ర్లు

agnathavasi nizam collections
బడా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏ సినిమా అయినా భారీగా కొంటున్నాడు అంటే ఆ సినిమా అంచనాలు భారీగా ఉంటాయి. పవన్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అత్యధికంగా 29 కోట్లకు కొనేశాడు. నైజాం లో ఎక్కువ సంఖ్యలో కూడా సినిమా రిలీజ్ చేశారు. అయితే సినిమా మిక్సెడ్ టాక్ రావడంతో దిల్ రాజుకి నష్టాలు తప్పవని అంటున్నారు.
సినిమా మీద నమ్మకంతో 29 కోట్ల దాకా పెట్టేసిన దిల్ రాజు మొదటి రోజు కేవలం 5.40 కోట్ల వరకే వసూళ్లను రాబట్టిందట. పెట్టింది రాబట్టాలంటే మరో 23 కోట్ల పైగా రాబట్టేయాలి. మరి ఈ టాక్ తో పవన్ అజ్ఞాతవాసి అంత రాబడుతుందా అన్నది చూడాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా.. అన్ని రైట్స్ కలిపి సినిమాకు 200 కోట్లు వస్తేనే కాని సూపర్ హిట్ అనిపించుకోదు.
మరి మొదటి రోజు భారీగానే వసూళ్లను రాబట్టి 60.5 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేయగా.. 39.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ రకంగా చూస్తే వరుసగా 3 రోజులు ఇదే రేంజ్ వసూళ్లు రాబడితే సినిమా సేవ్ అయినట్టే లెక్క. మరి అసలు సినిమా లెక్క ఏంటన్నది రిలీజ్ అవబోయే సినిమాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.

1st డే హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టిన టాప్ సినిమాలివే..! చూస్తే షాక్ అవ్వాల్సిందే

Leave a comment