బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘మహర్షి’ వీకెండ్ కలెక్షన్లు..

75

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మే 9న రిలీజైన సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి.

ఈ సినిమాలో రైతుల కోసం ఇచ్చిన మెసేజ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇక ఈ మూవీలో కమెడియన్ అల్లరి నరేష్ సీరియస్ రోల్ ప్లే చేశాడు..ఈ సినిమాలో అతనిదే కీ రోల్. ఇక అందాల భామ పూజా హెగ్డే కూడా గ్లామర్ తో బాగానే అలరించింది.

ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకు పోతున్నాయి. మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 4 రోజుల్లో ఏపి/తెలంగాణలో 47.60 కోట్ల షేర్ రాబట్టింది.

నైజాం : 16.61 కోట్లు
సీడెడ్ : 5.60 కోట్లు
ఉత్తరాంధ్ర : 5.55 కోట్లు
ఈస్ట్ : 4.86 కోట్లు
వెస్ట్ : 3.73 కోట్లు
గుంటూరు : 5.90 కోట్లు
నెల్లూరు : 1.71 కోట్లు
ఏపి/తెలంగాణ : 47. 58 కోట్లు

Leave a comment