‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్..పక్కా మాస్..!

ఈ మద్య మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి సినిమాలు మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఇలాంటి సినిమాలు మాస్ తో పాటు కాస్త బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువే చూపిస్తున్నారు.

తాజాగా ఫలక్నుమా దాస్ ట్రైలర్ రిలీజ్ అయిన నాలుగు గంటల్లోనే మూడు లక్షల వ్యూస్ ని సంపాదించింది. నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్ తో అందరిని తన హైదెరాబాదీ యాస, మాస్ ఎలిమెంట్స్, పిచ్చెక్కిచ్చే లా అనిపిస్తుంది. ఆకట్టుకున్న హీరో అండ్ డైరెక్టర్ విశ్వక్ సేన్, ట్రైలర్ లో మాస్ హవా తగ్గకుండా, స్టోరీ ని చక్కగా పరిచయం చేసి, యూత్ ని మరింత ఆక్కట్టుకున్నాడు. కదా మొత్తం ఒక ‘బోటి కర్రీ’ వల్ల మారిపోయే పాయింట్ యూత్ కి తెగ కనెక్ట్ అయిపోయింది.

అలానే, హీరోయిన్ ‘సలోని మిశ్ర’ తో దాస్ కెమిస్ట్రీ కూడా బాగుంది ట్రైలర్ లో. ఇంకా వివేక్ సాగర్ మ్యూజిక్ ట్రైలర్ కె స్పెషల్ అట్రాక్షన్. ఇటీవల కొత్త దర్శకులు వంగా సందీప్ ‘అర్జున్ రెడ్డి’, అజయ్ భూపతి ‘ఆర్ ఎక్స్ 100’లాంటి వారు ఇలాంటి కంటెంట్ తో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ ట్రైలర్..పక్కా మాస్ చూస్తుంటే పక్కా మాస్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది.

Leave a comment