క్లోజింగ్ కలెక్షన్స్….ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

యంగ్ యాక్టర్ శర్వానంద్ ఈ సంవత్సరం సంక్రాంతి కి శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకి బాలకృష్ణ శాతకర్ణి , చిరంజీవి ఖైదీ సినిమాల నుండి పోటీ ఎదురైనప్పటికి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే సంవత్సరం దసరా కి శర్వానంద్ ‘మహానుభావుడు’ అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచారు.
ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కి కూడా ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్ బాబు స్పైడర్ చిత్రాల ద్వారా తీవ్ర పోటీ నెలకొంది.
రెండు బడా చిత్రాల నుండి పోటీ ఎదురైనప్పటికి మహానుభావుడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబట్టి డీసెంట్ హిట్ గ నిలిచింది.ఈ చిత్రం కథాంశం మొత్తం OCD అనే వ్యాధితో సతమతమవుతున్న ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుంది.

ఈ సినిమాలో శర్వానంద్ కి హీరోయిన్ గ మెహ్రీన్ కౌర్ నటించింది. ఈ సినిమాకి SS థమన్ సంగీతం అందించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ వారు ఏ సినిమాని నిర్మించారు.
దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం సుమారుగా రూ. 23.19 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం.ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 20 కోట్లు అని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి శర్వానంద్ నటన, అతని ఆహార్యం ప్రధాన ఆకర్షనగా నిలిచాయి.

నైజాం రూ 6 .10 (కోట్లలో)
సీడెడ్ రూ 2 .70
వైజాగ్ రూ 2 .80
గుంటూరు రూ 1 .80
ఈస్ట్ రూ 1 .70
వెస్ట్ రూ 1 .08
కృష్ణ రూ 1 .63
నెల్లూరు రూ 0 .63

ఏపీ & తెలంగాణ రూ 18 .44 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా రూ 1 .95
రెస్ట్ అఫ్ వరల్డ్ రూ 2 .85

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ 23 .19 కోట్లు

Leave a comment