Newsమహానాయకుడిని అడ్డుకుంటున్న కథానాయకుడు..?

మహానాయకుడిని అడ్డుకుంటున్న కథానాయకుడు..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడి పేరుతో ఓ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో ఎన్నెన్నో అంచలంతో… ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే… ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న ప్లాప్ సినిమా.

ఈ ‘కథానాయకుడు’ జనవరి 9న విడులైంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ బయోపిక్ కావడం, ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలు ఆ సినిమా అందుకోలేకపోయింది.

ఈ ఎఫెక్ట్ కారణంగా ఎన్టీఆర్ ‘మహానాయకుడి’ మీద బాగా పడిందట. కథానాయకుడి ప్లాప్ టాక్ కారణంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మహానాయకుడిని తీసుకురావాలని విడుదల మరికొద్ది రోజులు వెనక్కి జరపాలని చూస్తున్నారట. అసలు రెండో భాగాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు యూనిట్ గతంలోనే ప్రకటించింది. తొలి భాగం నిరాశ పరచడంతో రెండో భాగం విడుదలకు ఆ ఎఫెక్ట్ పడింది.

రెండో భాగం అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని యూనిట్ ఆలోచిస్తోందట. నిజానికి మొదటి భాగం కంటే రెండో భాగానికే ప్రేక్షకుల్లో ఎక్కువ వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి నిజాలను దాచిపెట్టి సినిమా తెరకెక్కించారని ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి.మరోవైపు తనను సినిమాలో విలన్‌ గా చూపిస్తే కోర్టును ఆశ్రయిస్తానని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మీడియాకెక్కారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని మరీ మార్పు చేర్పులు చేయాలనీ చూస్తున్నారు. ఏది ఏమైనా కథానాయకుడు … మాత్రం మహానాయకుడి దెబ్బేసాడు అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news