మహర్షి ఇంటర్వల్ సీన్ అదిరిపోద్దట..!

Maharshi movie updates

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇంటర్వల్ సీన్ హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.

సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ.ఓగా బిలీనియర్ గా హుందాగా బ్రతికే హీరోకి సడెన్ గా తన స్నేహితుడు కష్టాల గురించి తెలుస్తాయట. అక్కడ సినిమా టర్న్ తీసుకుని యూరప్ నుండి ఇండియాకు వస్తాడట రిషి. ఆ సీన్ ఇంటర్వల్ లో వస్తుందట. అది సినిమాకే హైలెట్ గా నిలిచే సీన్ అని అంటున్నారు. సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా మహర్షి వస్తుందట.

ఏప్రిల్ 6 రిలీజ్ అనుకున్నా సినిమా అవుట్ పుట్ బాగా రావడం కోసం సినిమా ఏప్రిల్ చివర దాకా వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ నెలలో వచ్చిన మహేష్ సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ మహర్షి రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేస్తున్న ఈ మహర్షి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment